CM Chandrababu: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: రాజమండ్రి కల్తీ పాల ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu: రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
CM Chandrababu: రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్న ఆయన, బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున తక్షణ చర్యలు ప్రకటించారు.
మృతుల కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం:
లాలాచెరువు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని సీఎం ధృవీకరించారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. 'వరలక్ష్మి డెయిరీ'కి చెందిన కల్తీ పాల వల్లే స్థానికులు అస్వస్థతకు గురైనట్లు నిర్ధారణ అయిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ అరాచకానికి పాల్పడిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఇప్పటికే బాధ్యులపై సెక్షన్ 194 కింద కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఆహార కల్తీకి పాల్పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యక్తులు లేదా సంస్థలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



