'చంద్రబాబు నివాసం వద్దకు ఆయనెందుకు వచ్చాడు'

చంద్రబాబు నివాసం వద్దకు ఆయనెందుకు వచ్చాడు
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తడంతో అమరావతిలోని కృష్ణానది కరకట్టపై భారీగా వరద నీరు...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తడంతో అమరావతిలోని కృష్ణానది కరకట్టపై భారీగా వరద నీరు చేరింది. దాంతో ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా చంద్రబాబును ప్రభుత్వం కోరుతోంది. అయితే టీడీపీ మాత్రం వైసీపీ నేతలు అపద్ధాలు ప్రచారం చేస్తున్నారంటున్నారు, కరకట్టమీదకు నీరే రాలేదని అంటున్నారు. ఈ క్రమంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉదయాన్నే వెళ్లి బాబు నివాసాన్ని పరిశీలించారు. వాస్తవానికి వరద నీరు కరకట్ట మీదకు వచ్చేసింది. చంద్రబాబు నివాసంలోకి నీరు రాకుండా ఉండేందుకు ఇసుక బస్తాలను ఏర్పాటు చేశారు. ఈ తంతు జరుగుతూనే ఉండగా హఠాత్తుగా రెండు డ్రోన్ లు చంద్రబాబు నివాసం మీద చక్కర్లు కొట్టాయి. దాంతో వెంటనే టీడీపీ నేతలు కొందరు అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఈలోపు ఇరిగేషన్ శాఖ కూడా స్పందించింది. డ్రోన్ లను తామే పంపించామని వరద మొత్తం వీడియో తీయాలని సూచించినట్టు వివరణ ఇచ్చారు. అయినా టీడీపీ నేతలు శాంతించలేదు. బోండా ఉమా, దేవినేని అవినాష్ తదితరులు తమ అనుచరులతో అక్కడే ధర్నాకు దిగారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నివాసం వద్దకు రావడానికి అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎవరు, ఆయనెందుకు వచ్చాడు, డ్రోన్ లు వినియోగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇంతలో పరిస్థితి చేయిదాటి పోవడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటు టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు వైసీపీ నేతలు. వరద వచ్చి ఇళ్ళు మునిగిపోతోంటే వీడియో తీయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ ప్రభుత్వ చర్యలను తప్పుబట్టడం ఏంటని వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మండిపడ్డారు. ఇదిలావుంటే రెండు పార్టీలు చంద్రబాబు ఇంటిపై రాజకీయ విమర్శలు చేసుకుంటుంటే ఇటు నీటమునిగిన లంక గ్రామాల ప్రజలు తమ పరిస్థితి ఏంటని వాపోతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories