టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడి.. విలువైన వస్తువుల ధ్వంసం

Mangalagiri: ఏపీ పాలిటిక్స్‌లో గంజాయి కామెంట్ల రగడ రాజుకుంది.

Arun Chilukuri
Published on: 19 Oct 2021 5:51 PM IST
Clash Between TDP and YCP Leaders in Mangalagiri
X

టీడీపీ నేత పట్టాభి నివాసంపై దాడి.. విలువైన వస్తువుల ధ్వంసం

Mangalagiri: ఏపీ పాలిటిక్స్‌లో గంజాయి కామెంట్ల రగడ రాజుకుంది. గంజాయి రవాణాపై టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు చేసిన ఆరోపణలపై పోలీసులు నోటీసులిచ్చారు. దీనిపై స్పందించిన పట్టాభి ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైసీపీ నేతలు సైతం అంతే తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. టీడీపీ కార్యాలయం ముట్టడికి వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఎంపీ నందిగం సురేష్ బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలోనే విజయవాడలోని పట్టాభి ఇంటిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పట్టాభి ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమైనట్లు సమాచారం.

మరోవైపు మంగళగిరి టీడీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఛాంబర్ సహా ఆఫీస్ ఫర్నీచర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హుటాహుటిన టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కార్యాలయానికి బయల్దేరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story