Tirupati: ఓ దాబాలో తిరుపతి, మహారాష్ట్ర వాసుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

Tirupati: ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Shekhar G
Updated on: 24 Feb 2024 4:30 PM IST
Clash Between Residents Of Tirupati And Maharashtra In Dhaba Near Renigunta
X

Tirupati: ఓ దాబాలో తిరుపతి, మహారాష్ట్ర వాసుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

Tirupati: తిరుపతి రేణిగుంట సమీపంలోని ఓ దాబా హోటల్లో తిరుపతి, మహరాష్ట్ర వాసులకు మధ్య జరిగిన ఘర్షణలో పుణేకి చెందిన ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని పుణే, పరిసర ప్రాంతాలకు చెందిన 11 మంది స్నేహితులు బృందంగా ఏర్పడి శ్రీవారి దర్శనం కోసం తిరుపతి వచ్చారు. శ్రీకాళహస్తి వెళుతూ... మార్గమధ్యలోని రేణిగుంట మండలం గుర్తి వారిపల్లి - మల్లవరం మధ్య రోడ్డు పక్కనున్న సంతోష్ పంజాబీ దాబా హోటల్ వద్ద ఆగారు.

కొంతసేపటికి తిరుపతి నగరం కొద్దిగుంటకు చెందిన ఆరుగురు మద్యం తాగి.. దాబా దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు... సడన్ బ్రేక్ వేయడంతో పెద్దఎత్తున దుమ్ము రేగింది. అదే హోటల్లో మహారాష్ట్రకు చెందిన వారు కూర్చుని భోజనం చేస్తుండగా దుమ్ము వారి ప్లేట్లలో పడింది.

దీంతో ఆగ్రహించిన మహారాష్ట్ర వాసులకు... తిరుపతివాసులకు మధ్య ఘర్షణ జరిగింది. పుణేకి చెందిన రిమంత్ జగపత్, కుల్దీప్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిద్దరినీ తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ రిషత్ జగవత్ మృతి చెందాడు. మృతుడి స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదుతో రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతికి చెందిన అరుగురిలో ఇప్పటికే ముగ్గురిని పోలీసు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. మిగితా వారి కోసం గాలిస్తున్నారు. రివంత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీలకు మృతదేహాన్ని అప్పగించారు.

Shekhar G

Shekhar G

Next Story