ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై క్లారిటీ వచ్చే ఛాన్స్...

Ticket Rates in AP: ఉదయం 11.45 గంటలకు వర్చువల్‌గా భేటీ కానున్న కమిటీ...

Shireesha
Published on: 31 Dec 2021 8:12 AM IST
Clarity on Cinema Ticket Rates Issue in AP Today 31 12 2021 | AP Latest News
X

ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై క్లారిటీ వచ్చే ఛాన్స్...

Ticket Rates in AP: ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11.45 గంటలకు వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో.. టికెట్ల ధరల నిర్థారణ, థియేటర్ల వర్గీకరణ అంశాలపై.. హోమ్‌శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌ నేతృత్వంలో 13 మంది సభ్యుల కమిటీ చర్చించనుంది.

ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు, సినీ బయ్యర్లు, నిర్మాతల విజ్ఞప్తులను కమిటీ పరిశీలించనుంది. ఇండస్ట్రీలోని వివిధ శాఖలకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించిన అభ్యర్థనలను ఈ సమావేశంలో చర్చించే ఛాన్స్ ఉంది.

Shireesha

Shireesha

Next Story