తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana: *సీజేఐకి స్వాగతం పలికిన చైర్మన్, ఈవో *రంగనాయకుల మండపంలో సీజేఐకి వేద పండితుల ఆశీర్వచనం

Rama Rao
Published on: 6 March 2022 10:43 AM IST
CJI NV Ramana Visiting Tirumala  | AP News Today
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ 

CJI NV Ramana: తిరుమల వెంకన్నను భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించుకొని గర్భాలయంలోకి వెళ్లిన సీజేఐ శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకున్నారు.

అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు పండితులు వేద ఆశీర్వాదం చేయగా. టీటీడీ చైర్మన్, ఈవో, ఆదనవు ఈవో లు ఎన్వీ రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆంజనేయుని జన్మస్థలం పై టీటీడీ ముద్రించిన పుస్తకాన్ని అందజేశారు. అనంతరం ఆలయానికి అభిముఖంగా ఉన్న బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న సీజేఐ కుటుంబం అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు.

Rama Rao

Rama Rao

Next Story