CJI NV Ramana: శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు

CJI NV Ramana: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 11 Jun 2021 9:57 AM IST
CJI NV Ramana Offers Prayers TO Lord Balaji Temple in Turumala
X

CJI NV Ramana: శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు

CJI NV Ramana: తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి తిరుమలకు వచ్చి ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అర్చకులు సంప్రదాయం ప్రకారం వారికి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు దర్శించుకున్నారు.

అంతకుముందు ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎన్వీ రమణ దంపతులు బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story