శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న జస్టిస్ ఎన్వీ రమణ

Justice N.V. Ramana: శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు.

Kranthi
Updated on: 18 Jun 2021 11:38 AM IST
CJI Justice N.V. Ramana  Visits Srisailam Temple
X

జస్టిస్ ఎన్ వీ రమణ దంపతులు (ఫైల్ ఇమేజ్)

Justice N.V. Ramana: శ్రీశైలంలోని భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయంలోని నంది నికేతన్‌ అతిథిగృహం వద్దకు చేరుకున్న జస్టిస్‌ ఎన్వీ రమణకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్ వీరపాండియన్, ఆలయన ఈవో కేఎస్ రామారావు లతో పాటు ప‌లువురు నేత‌లు, అధికారులు పుష్పగుచ్ఛాలతో స్వాగ‌తం ప‌లికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ‌తం ప‌లికారు.

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆల‌య ప‌రిస‌రాల వ‌ద్ద పోలీసులు భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. కాగా, ఇటీవ‌లే జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు తిరుప‌తిలో శ్రీ‌వారిని, యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story