నేడు తిరుపతిలో డాలర్ శేషాద్రి అంత్యక్రియలు.. హాజరుకానున్న ఎన్‌వీ రమణ

Dollar Seshadri: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు.

Sandeep Eggoju
Updated on: 30 Nov 2021 6:55 AM IST
CJI Justice NV Ramana Going to be Attend the Dollar Seshadri Funeral
X
డాలర్ శేషాద్రి అన్యక్రియలకు హాజరు కానున్న జస్టిస్ ఎన్వీ రమణ (ఫైల్ ఇమేజ్)

Dollar Seshadri: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. వేకువజామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు తుది శ్వాస విడిచారు. 1978 నుంచి డాలర్‌ శేషాద్రి శ్రీవారి సేవలో ఉన్నారు. 2007లో రిటైర్‌ అయినా శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో ఓఎస్డీగా టీటీడీ కొనసాగించింది. మరణించే చివరి క్షణం వరకు ఆయన స్వామి సేవలో తరించారు.

కేజీహెచ్‌లో శేషాద్రి భౌతికకాయానికి ఎంబామింగ్‌ చేసి రోడ్డుమార్గంలో తిరుపతికి తరలించారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం మధ్యాహ్నం వరకు సందర్శనార్థం తిరుపతిలోని సరోజినీదేవి లేఔట్‌లో పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం గోవిందధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, పలువురు మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరుకానున్నట్లు తితిదేకు సమాచారం అందింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story