విశాఖ జిల్లా ఫార్మా కంపెనీల ప్రాంతాలు భూతల నరకాలు!

విశాఖ జిల్లా ఫార్మా కంపెనీల ప్రాంతాలు భూతల నరకాలు!
x
Highlights

ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 20 ఏళ్ల సమస్య. ఈ ప్రాంతాన్ని చూసిన పర్యావరణవేత్తలు భూతల నరకంగా అభివర్ణిస్తున్నారంటే సమస్య తీవ్రతను ఇట్టే అర్థం...

ఒకటి కాదు.. రెండు కాదు.. సుమారు 20 ఏళ్ల సమస్య. ఈ ప్రాంతాన్ని చూసిన పర్యావరణవేత్తలు భూతల నరకంగా అభివర్ణిస్తున్నారంటే సమస్య తీవ్రతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతలా పరిశ్రమ కాలుష్య భూతం ఆవహించింది. నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వాయి, జల వ్యర్థాలను బయటకు వదలడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కాలుష్య సమస్యకు కేంద్ర స్థానంగా చెప్పుకుంటున్న విశాఖ జిల్లా ఫార్మాకంపెనీలపై hmtv గ్రౌండ్ రిపోర్టు.

విశాఖ ఆర్థిక రాజధానే కాదు పారిశ్రామిక రాజధాని కూడ. అయితే ఇక్కడ ఎన్ని పరిశ్రమలున్నాయో అన్నే సంఖ్యలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అదేవిధంగా నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం ప్రజల ప్రాణాలను బలితీసుకుంటుంది.

విశాఖ ఫార్మాసిటి 2వేల 400ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో సుమారు 80కిపైగా పరిశ్రమలు ఉన్నాయి. అయితే ఫార్మా కంపెనీలతో ప్రధానంగా ముత్యాలపాలెం, తానం, తాడి, తిక్కవానిపాలెం బాధిత గ్రామాలుగా మారాయి. ప్రధానంగా తాడిలో 1800లకుపైగా జనాభ ఉండగా పరిశ్రమల నుండి వెలువడే దుర్వాసనతో ఇక్కడి జనం ఉక్కిరిబిక్కరి అవుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సరాసరి తిక్కవానిపాలెం సముద్ర తీరంలోకి విడిచిపెట్టడంతో మత్స్యసంపద లేక జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రధానంగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు జనాల్ని పొట్టునపెట్టుకుంటున్నాయి. ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలు ప్రజల్ని బెంబేలితిస్తున్నాయి. 1997లో hpcl ట్యాంకులు పేలినప్పుడు ప్రజలు కొండలు, గుట్టలు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. నాటి ఘటనలో సుమారు 60మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే నాలుగేళ్ల కిందట అదే కంపెనీలో కూలింగ్ టవర్‌ కూలిపోయి 38మంది చనిపోయారు. అదేవిధంగా 2012లో స్టీల్‌ప్లాంట్‌లో ట్యాంకర్‌ పేలిపోయి 19మంది మృతిచెందారు. ఇటీవల ఎల్జీపాలిమర్స్‌ ప్రమాదంలో 15 మంది కన్నుమూశారు.

తమపార్టీ అధికారంలోకి వస్తే తాడి గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ హామి ఇచ్చింది. అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి పలు దఫాలుగా తాడి సమస్యను ఆపార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో గ్రామాన్ని పెదముషిడివాడకు తరలించి పునరావాసం కల్పించడానికి ఆర్‌అండ్‌ఆర్‌ నిధులు 57కోట్ల 63లక్షల రూపాయలను మంజూరు చేస్తూ 2019 ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు జీవో జారీ చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

అటు 2019 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే తాడి గ్రామాన్ని తరలిస్తామని వైసీపీ హామి ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 15నెలలైనా ఎటువంటి హామీలు అమలుకాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పాలంటే 2019 నవంబరులో పారిశ్రామిక వ్యర్థల నిర్వాహణకు తాడికి సమీపంలో 50 ఎకరాల ఏపీఐఐసీకి కేటాయించిందే తప్ప, గ్రామ తరలింపు చర్యలు తీసుకోలేదు. ఇక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రయోజనం లేదంటున్నారు బాధితులు. మొత్తానికి ఎన్నికల సమయంలో తమను ఆదుకుంటామని చెబుతున్న నేతలే ఓట్లు పడక్కా దిక్కులు చూస్తున్నారు. సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పా తాడి గ్రామస్తులు బతుకులు మారడం లేదు. ఉపాధి దేవుడెరుగు జీవించడానికి తాము బ్రతికుంటే చాలు అంటున్నారు బాధితులు.

Show Full Article
Print Article
Next Story
More Stories