Andhra Pradesh: విశాఖ కేజీహెచ్‌లో సీఐడీ సోదాలు

Andhra Pradesh: ప్రత్యేక బృందాలతో తనిఖీలు * ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల ఆడిట్

Sandeep Eggoju
Published on: 11 April 2021 9:47 AM IST
CID Raids in KGH Visakhapatnam
X
కేజీహేచ్ లో సీఐడీ దాడులు (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: విశాఖలోని కేజీహెచ్‌లో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. ఏపీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఐడీ అధికారులు వైద్య పరికరాల ఆడిట్ చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖలోని కేజీహెచ్‌ ఆస్పత్రిలో సీఐడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో వైద్య పరికరాల నిర్వహణ, వార్షిక కాంట్రాక్టు, గుత్తేదారు సంస్థతో జరిగిన ఒప్పందాలు, చెల్లింపులు వంటి వాటిపై వివరాలను సేకరించింది.

ఆదనపు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, ఎనిమిది మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో కూడిన ఆరు బృందాలు వివిధ విభాగాల సిబ్బందిని ప్రశ్నించి వివరాలు సేకరించారు. కేజీహెచ్‌లో దాదాపు 3వేల పైగా పరికరాలు ఉన్నాయి. వీటి కొనుగోళ్లలో కొంతవరకు వాటి ధర కంటే ఎక్కువ ఇచ్చి కొన్నట్టు ఆరోపణలు రావడంతో సోదాలు నిర్వహిస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story