Chundur SI: కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి

Chundur SI: గత శనివారం ఆత్మహత్యకు యత్నించిన గుంటూరు జిల్లా చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందారు.

Arun Chilukuri
Published on: 12 May 2021 10:04 AM IST
Chundur SI Sravani Died in Hospital while Treatment
X

Chundur SI: కానిస్టేబుల్‌తో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి

Chundur SI: గత శనివారం ఆత్మహత్యకు యత్నించిన గుంటూరు జిల్లా చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి (35) మృతి చెందారు. మూడు రోజుల కింద‌ట ఈమె గ‌డ్డి మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. శ్రావ‌ణి స్వగ్రామం ప్ర‌కాశం జిల్లా కందుకూరు. చుండూరులో విధులు నిర్వ‌ర్తించే ఈమె ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం క‌న్నుమూశారు. గత శనివారం కానిస్టేబుల్ రవీంద్రతో కలసి శ్రావణి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణీ 2018 బ్యాచ్ ఎస్ఐ. నరసరావుపేటలో దిశ పోలీసు స్టేషన్‌లో తొలి పోస్టింగ్ వచ్చింది. చుండూరు పోలీసు స్టేషన్లలో ఎస్ఐ శ్రావణీ ఏడు నెలల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు బలవన్మరణానికి యత్నించిన కానిస్టేబుల్ రవీంద్ర ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story