చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు : ఎమ్మెల్యే ధర్మశ్రీ

చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు : ఎమ్మెల్యే ధర్మశ్రీ
x

చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారు : ఎమ్మెల్యే ధర్మశ్రీ


Highlights

చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని విశాఖ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆరోపించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం వ్యాక్సిన్‌...

చంద్రబాబు డైరెక్షన్‌లోనే నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని విశాఖ ఎమ్మెల్యే ధర్మశ్రీ ఆరోపించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం వ్యాక్సిన్‌ ప్రక్రియను ఉధృతంగా చేస్తుంటే ఇలాంటి సమయంలో ఎన్నికలు సబబుకాదన్నారు. ఎస్‌ఈసీ దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం దారుణమన్నారు. ఉద్యోగులు ఈ సమయంలో ఎన్నికలంటే ఆందోళనకు గురవుతారని ప్రభుత్వానికి ఉద్యోగులు, ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు వాయిదా వేయకపోతే నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలంటూ నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్టు నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఉద్యోగుల బాధలు ఎస్‌ఈసీ అర్థం చేసుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గణేష్‌.


Show Full Article
Print Article
Next Story
More Stories