Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నగరి సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

Arun Chilukuri
Published on: 9 Dec 2025 12:14 PM IST
Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి
X

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

Chittoor Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నగరి సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల్లో ఇద్దరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం కార్మికులు కాగా.. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంతో పాటు, చెన్నై-తిరుపతి హైవేపై రహదారి విస్తరణ పనుల కారణంగా సరైన మళ్లింపు సూచిక బోర్డులు లేకపోవడమే ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story