నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని రెండో రోజు పర్యటన

నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని రెండో రోజు పర్యటన
x
Highlights

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటించారు. నీటిలో...

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. నిన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటించారు. నీటిలో పూర్తిగా మునిగిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.

ఇవాళ చిత్తూరు జిల్లాలో జనసేనాని పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకొని అక్కడినుంచి కారకంబాడీ మీదుగా లీలామహల్‌ సర్కిల్‌లోని హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు పవన్. అనంతరం సాయంత్రం 5 గంటలకు చిత్తూరు జిల్లా జనసేన ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతారు. తుపాను కారణంగా జిల్లాలో నెలకొన్న పంటనష్టంపై వివరాలను అడిగి తెలుసుకుంటారు పవన్.

రేపు ఉదయం 9 గంటలకు శ్రీకాళహస్తిలో జనసేనాని పర్యటించనున్నారు. పంటలను పరిశీలించి అనంతరం రైతులతో ము‍ఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం అక్కడినుంచి నెల్లూరు జిల్లాకు చేరుకుంటారు. 5న రాపూరు, వెంకటగిరిలో పర్యటిస్తారు. అక్కడినుంచి విజయవాడ తిరుగు ప్రయాణమవుతారు పవన్.

Show Full Article
Print Article
Next Story
More Stories