Tomato: ఎర్ర బంగారంతో చిత్తూరు రైతుకు నాలుగు కోట్లు లాభం

Chittoor Farmer Earned 4 Crores From Tomato
x

Tomato: ఎర్ర బంగారంతో చిత్తూరు రైతుకు నాలుగు కోట్లు లాభం

Highlights

Tomato: 22 ఎకరాల్లో టమోటా సాగు చేసిన చిత్తూరు రైతు చంద్రమౌళి

Tomato: గత కొద్ది రోజులుగా దేశంలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు టమోటాలను కొనాలంటేనే భయపడిపోతున్నారు. అయితే భూమిని నమ్ముకున్న రైతుకి అనూహ్య రీతిలో అదృష్టం వరించింది. టమోటాల పంటసాగు చేసిన ఓ రైతు మూడు కోట్ల రూపాయలను సంపాదించాడు..

వ్యవసాయంపై పెట్టుబడి పెట్టి ఎంతో మంది రైతులు వలసలు వెళ్ళిన ఘటనతో పాటుగా, ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు అనేకమే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు టమోటా పంటపై ఆధారపడి‌ పంటను సాగు చేశారు. సీజన్ మొదట్లో టమోటాకు సరైన గిట్టు బాటు ధర లేక చాలా మంది రైతులు అప్పుల ఊబిలో చిక్కుకున్నారు. ఈ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా టమోటాకు అధిక ధర రావడంతో టమోటా రైతులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో ఇన్నాళ్ళు అప్పులు చేసి‌ బ్రతుకు జీవుడా అంటూ బ్రతుకును సాగించిన రైతులు జేబులు ఇప్పుడు గలగల మంటున్నాయి.

టమాటా అధికంగా సాగయ్యే చిత్తూరు జిల్లా కరకమంద గ్రామానికి చెందిన చంద్రమౌళి రైతు కుటుంబం కేవలం నెల రోజుల వ్యవధిలోనే 3 కోట్ల ఆదాయం పొందింది. వేసవి అనంతరం వచ్చే పంటకు మంచి ధర వస్తుందని ఆ కుటుంబం గుర్తించింది. పలు మార్లు టమోటా పంట నష్టాలు రుచి చూసినా పట్టు విడవకుండా తిరిగి అదే పంటను ఎన్నుకున్నారు. ఏప్రిల్ లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సాహూ రకం టమాటా మొక్కలు 22 ఎకరాల్లో నాటారు.

కట్టెసాగు విధానంలో మల్చింగ్, సూక్ష్మ సేద్య పద్ధతులు పాటించారు. జూన్ చివరిలో దిగుబడి మొదలైంది. దిగుబడిని జిల్లాకు దగ్గరగా ఉండే కర్ణాటకలోని కోలార్ మార్కెట్ విక్రయించారు. వేలం పాటలో 15 కిలోల పెట్టె ధర వెయ్యి నుంచి 15వందల మధ్య పలికింది. ఇప్పటి వరకు 40వేల పెట్టెలు విక్రయించగా 4 కోట్లు ఆదాయం వచ్చినట్లు రైతు తెలిపారు. అందులో ఎకరాకు 3 లక్షల చొప్పున 22 ఎకరాలకు 70 లక్షలు పెట్టుబడి పెట్టాడు. కమీషన్ 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షలు పోనూ 3 కోట్ల ఆదాయం వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.

గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా టమోటా ధరలు మండుతున్నాయి. దేశంలో అతిపెద్ద టమోటా మార్కెట్ లో ఒక్కటైనా మదనపల్లె ‌టమోటా మర్కెట్ యార్డ్ నుండి వివిధ రాష్ట్రాలకు ప్రతి నిత్యం టమోటా ఎగుమతి జరుగుతుంటుంది. ఒక్కసారిగా టమోటా ధర అధికంగా కావడంతో టమోటా రైతులు సంతోషానికి హద్దులు లేవు..

Show Full Article
Print Article
Next Story
More Stories