అమెరికాలో తెలుగు మహిళ మృతి

అమెరికాలో తెలుగు మహిళ మృతి
x
Highlights

అమెరికాలో తెలుగు మహిళ మృతి చెందింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన ప్రేమలత చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లికి చెందిన...

అమెరికాలో తెలుగు మహిళ మృతి చెందింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బందార్లపల్లెకు చెందిన ప్రేమలత చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లికి చెందిన సుధాకర్‌ను 2016లో వివాహం చేసుకుంది. సుధాకర్‌ అమెరికా న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. 2017లో భార్య ప్రేమలతను తీసుకుని అమెరికాకు వెళ‌్లగా వీరికి రెండున్నరేళ్ల బాబు ఉన్నాడు.

మంగళవారం రాత్రి ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లిదండ్రులకు సమాచారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా వారు షాక్‌ అయ్యారు. ప్రేమలతది ఆత్మహత్య కాదని సుధాకర్‌ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రేమలత మృతదేహాన్ని ఇండియాకు పంపించడానికి భర్త నిరాకరిస్తున్నాడని, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories