జనసేనకు చిరంజీవి మద్దతు ఉందన్న నాదెండ్ల.. చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమా?

జనసేనకు చిరంజీవి మద్దతు ఉందన్న నాదెండ్ల.. చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమా?
x

జనసేనకు చిరంజీవి మద్దతు ఉందన్న నాదెండ్ల.. చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమా?

Highlights

*జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు *రాజకీయ ప్రస్థానంలో పవన్‌కు చిరంజీవి తోడు ఉంటారని వ్యాఖ్యలు *చిరంజీవి సూచన మేరకే పవన్‌ సినిమాలు చేస్తున్నారన్న నాదెండ్ల

జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో జనసేనకు చిరంజీవి మద్దుతు ఉండనుందని తెలిపారు. అంతేకాదు పవన్‌ రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తోడు ఉంటారన్నారు. పవన్‌ మళ్లీ సినిమాలు చేయడానికి చిరంజీవి కారణమన్న నాదేండ్ల రెండేళ్లు సినిమాలు చేయాలని పవన్‌కు చిరంజీవి సూచనలు చేశారన్నారు. ఇక మెగాస్టార్‌ సూచన మేరకే పవన్‌ సినిమాలు చేస్తున్నట్లు నాదేండ్ల స్పష్టం చేశారు.

నాదెండ్ల వ్యాఖ్యలతో జనసేన కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. రాజకీయాల్లోకి చిరంజీవి మళ్లీ ప్రవేశించడం ఖాయమని జనసేన కార్యకర్తలు అంటున్నారు. అంతేకాదు రానున్న తిరుపతి ఉపఎన్నికలో జనసేన నిలిస్తే పార్టీకి చిరంజీవి మద్దతుగా నిలుస్తారన్న టాక్‌ వినపడుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఏకగ్రీవాలకు తాము వ్యతిరేకమన్నారు.

ఇదిలా ఉంటే ఏకగ్రీవాల విషయంలో అధికార పార్టీ నాయకులు మాట్లాడిన మాటలపై జనసేన, బీజేపీ నేతలు గవర్నర్‌ను కలుస్తామన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతల మాటలు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నట్లు ఉందన్నారు. ఎన్నికల్లో యువతను ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. అదివిధంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories