Chiranjeevi: ఇవాళ ఏపీ సీఎం జగన్‌‌ను కలవనున్న మెగాస్టర్ చిరంజీవి

Chiranjeevi: హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు రానున్న చిరంజీవి

Rama Rao
Published on: 13 Jan 2022 10:13 AM IST
Chiranjeevi Will Meet AP CM Jagan Today | AP News Today
X

 ఇవాళ ఏపీ సీఎం జగన్‌‌ను కలవనున్న మెగాస్టర్ చిరంజీవి 

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను ఇవాళ మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి చిరంజీవి వెళ్లనున్నారు. రాష్ట్రంలో సినిమా టికెట్లు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. టికెట్ల ధరలు పెంచకుండా ఉంటే జరిగే నష్టాన్ని మెగాస్టార్ వివరించనున్నట్లు సమాచారం. సినిమా టికెట్ల వివాదం ముదురుతున్న కారణంగా ఈ మేరకు చిరంజీవి జగన్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే డైరెక్టర్ ఆర్జీవీ, మంత్రి పేర్నినానితో కలిసి టికెట్ల విషయంపై చర్చించారు.

ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం జరుగుతున్న నేపథ్యంలో సినిమా రంగానికి చెందిన పెద్దలు ఎవరూ జగన్‌ను కలవలేదు. చిరంజీవి కూడా సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపుపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు జగన్‌ను కూడా టాలీవుడ్ గుర్తించడం లేదన్న విమర్శలు కూడా ఇటీవల కాలంలో వైసీపీ నేతల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ను కలిసేందుకు చిరంజీవి నేడు విజయవాడ రానున్నారు. వీరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Rama Rao

Rama Rao

Next Story