Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దగా కాదు.. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చా..

Chiranjeevi: ముఖ్యమంత్రితో జరిగిన చర్చలు సంతృప్తికరంగా జరిగాయని చిరంజీవి అన్నారు.

Arun Chilukuri
Published on: 13 Jan 2022 4:27 PM IST
Chiranjeevi Press Meet After Meets CM Jagan
X

Chiranjeevi: ఇండస్ట్రీ పెద్దగా కాదు.. ఇండస్ట్రీ బిడ్డగా వచ్చా..

Chiranjeevi: ముఖ్యమంత్రితో జరిగిన చర్చలు సంతృప్తికరంగా జరిగాయని చిరంజీవి అన్నారు. పండుగ పూట ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. పరిశ్రమ సమస్యలు, ఎగ్జిబిటర్ల సమస్యలను సీఎంకు వివరించానని తెలిపారు. తాను చెప్పిన విషయాలను సీఎం నోటు చేసుకొని సానుకూలంగా స్పందించినట్లు చిరంజీవి వెల్లడించారు. ఏదో మంచి చేయాలన్నా ఆలోచన ప్రభుత్వానికి ఉందని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.

మరోసారి తమ టీంతో ముఖ్యమంత్రిని కలిసి చర్చిస్తామని తెలిపారు. ఇండస్ట్రీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న పూర్తి నమ్మకం తమకు ఉందని చిరు వెల్లడించారు. తాను ఇండస్ట్రీ పెద్దగా రాలేదని, ఇండస్ట్రీ బిడ్డగా వచ్చానని చెప్పారు. ఇండస్ట్రీలోని అందరితో చర్చించి, మళ్లీ ఇంకోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతానని చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి పది రోజుల్లో సినీ పరిశ్రమకు శుభవార్త వస్తుందని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story