Chiranjeevi: ఏపీ సీఎంను కలవనున్న చిరంజీవి..?

Chiranjeevi: టికెట్ల రేట్ల విషయం, థియేటర్స్ ఓపెన్ పై చర్చించే ఛాన్స్ * తెలంగాణ సీఎంను కూడా కలవనున్న మెగాస్టార్

Sandeep Eggoju
Published on: 24 Jun 2021 8:37 AM IST
Chiranjeevi is Going to be Meet the Andhra Pradesh CM Jagan
X

చిరంజీవి (ఫైల్ ఇమేజ్)

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో సారి ఏపీ సీఎం జగన్‌ను కలవబోతున్నారా? చిత్ర పరిశ్రమ సమస్యలపై మరోసారి సీఎం చర్చించబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. తెలంగాణలో థియేటర్ల ఓపినింగ్ కు పర్మిషన్ వున్నా, ఏపీలో మాత్రం ఇంకా కర్ఫ్యూ తో మూసే వున్నాయి.. త్వరలో పెద్ద సినిమాల రిలీజ్ వుండటంతో ఈ లోపు చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తోంది టాలీవుడ్.

టాలీవుడ్‌కు తెలంగాణ, ఏపీ రెండు కావాల్సిందే. స్టార్ హీరోలకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది ఏపీ నుండే.. కానీ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ టైంలో ఏపీలో టికెట్ల రేట్లు తగ్గించటంతో వకీల్ సాబ్ కి కలెక్షన్లపరంగా దెబ్బ తగిలింది. ఏపీలో మినిమం ఆ ఛార్జెస్ మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. దాని తర్వాత కరోనా సెకండ్ వేవ్ తో కర్ఫ్యూతో థియేటర్లను మూసేయాలసి వచ్చింది.

త్వరలోనే మళ్లీ థియేటర్ లు తెరుచుకునే పరిస్థితి ఏర్పడడంతో టికెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని సినీ పెద్దలు జగన్ తో భేటీ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో భారీ చిత్రాలే విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ రేట్లు వుంటే నష్టాలు ఉండొచ్చనే భావన కూడా మొదలైంది. అందుకే జగన్ తో మీటింగును ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని చూస్తున్నారు.

ఏపీ సీఎంను కలిసిన తర్వాత మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కూడ కలసి గతంలో లాక్ డౌన్ టైం లో కరెంట్ ఛార్జీస్ తగ్గిస్తామన్న విషయాన్ని గుర్తు చేసి.. టికెట్ల రేటు తో పాటు, పెద్ద సినిమాల రిలీజ్ టైంలో అదనపు షోలు వేసుకునే విధంగా పర్మిషన్ తెచ్చుకోవాలని చూస్తున్నారు.. మొత్తానికి టాలీవుడ్ త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలను కలసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని చూస్తుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story