ఎవరు చేస్తున్నారనేది ప్రస్తుతం అవసరం లేదు : చినజీయర్ స్వామి

ఎవరు చేస్తున్నారనేది ప్రస్తుతం అవసరం లేదు : చినజీయర్ స్వామి
x
Highlights

ఏపీలో ఆలయాలు ధ్వంసం అవుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విగ్రహ ధ్వంసాలు ఎవరు చేస్తున్నారనే ప్రస్తుతం...

ఏపీలో ఆలయాలు ధ్వంసం అవుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తామని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. విగ్రహ ధ్వంసాలు ఎవరు చేస్తున్నారనే ప్రస్తుతం అవసరం లేదని స్థానికులలో నెలకొన్న భయాందోళలను తొలగించాల్సి అవసరం ఉందని అన్నారు. స్థానికులను కలుస్తామని వారి నుంచి సూచనలు స్వీకరిస్తామని చినజీయర్ స్వామి తెలిపారు.

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని సీతానగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చినజీయర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే దారుణమైన స్థితి దాపురించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈనెల 14తో ధనుర్మాస దీక్ష పూర్తవుతుందని.. 17 నుంచి రాష్ట్రవ్యాప్తంగా విగ్రహాలు ధ్వంసమైన ఆలయాల సందర్శనకు యాత్ర చేపడతామని వివరించారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులను కలిసి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకోవాలని భావిస్తున్నామన్నారు. ధర్మజాగృతి కలిగిన పెద్దలందరినీ కలిసి వారి సహకారంతో చేయాల్సిన కార్యక్రమాలను త్వరలో నిర్ణయిస్తామని చినజీయర్‌ వివరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories