Abhishekam: 60 కేజీల కారంతో స్వామీజీకి అభిషేకం..

Chilli Powder Abhishekam: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమంలో శివ స్వామికి కారంతో అభిషేకం నిర్వహిచారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 21 Nov 2024 3:56 PM IST
Abhishekam: 60 కేజీల కారంతో స్వామీజీకి అభిషేకం..
X

Chilli Powder Abhishekam: ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులోని శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమంలో శివ స్వామికి కారంతో అభిషేకం నిర్వహిచారు. స్వస్తిశ్రీ చంద్రమానేనా క్రోధి నామ సంవత్సర కార్తీక బహుళ పంచామి రోజు సందర్భంగా కారం తో అభిషేకం నిర్వహించారు. చాలాకాలం నుంచి కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం 50 కేజీల కారంతో అభిషేకం చేయగా, ఈసారి 60 కేజీల కారంతో అభిషేకం చేశారు.

స్వామికి అభిషేకం చేసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యంగిరా దేవికి ఇష్టమైన కారంతో శివస్వామి బాబాకు అభిషేకం చేయించుకున్న వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story