Tirumala: తిరుమలలో చిరుత సంచారం
Tirumala: గోగర్భం అటవీశాఖ గార్డెన్ దగ్గర కనిపించిన చిరుత * భయాందోళనకు గురైన గార్డెన్ కాపలాదారులు
తిరుమలలో చిరుత సంచారం (ఫైల్ ఇమేజ్)
Tirumala: తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. గోగర్భం అటవీశాఖ గార్డెన్ దగ్గర చిరుత కనిపించడంతో.. గార్డెన్ కాపలదారులు భయాందోళనకు గురయ్యారు. గార్డెన్ వద్ద చిరుత సంచరించడం కాపలదారులు గుర్తించారు. దాంతో మరోసారి ఆ ప్రాంతం ఉలిక్కి పడింది.
కరోనా మొదటి లాక్‌డౌన్ తర్వాత తిరుమల శేషాచలం కొండల్లో చిరుతల సంచారం ఒక్కసారిగా పెరిగాయి. తరుచూ ఘాట్ రోడ్లపైకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల రెండో ఘాట్ దగ్గర కనిపించడంతో భక్తులు మరింత ఆందోళనకు గురయ్యారు.
Next Story




