Penukonda: చిరుతకు యాక్సిడెంట్.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుత

Penukonda: పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

Jyothi
Published on: 6 Feb 2024 10:16 AM IST
Cheetah Accident in Sri Sathya Sai District
X

Penukonda: చిరుతకు యాక్సిడెంట్.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిరుత

Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఆర్డీవో చెక్‌పోస్ట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సమీపంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చిరుత తలకు బలంగా గాయమైనట్లు గుర్తించారు. గాయాల కారణంగా చిరుతపులి కదల్లేని స్థితిలో ఉండడంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story