Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు

Mekapati Goutham Reddy Funeral: మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలాన్ని మార్చారు.

Arun Chilukuri
Published on: 21 Feb 2022 8:37 PM IST
Change of Mekapati Goutham Reddy Funeral Place
X

Mekapati Goutham Reddy: మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలం మార్పు

Mekapati Goutham Reddy Funeral: మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల స్థలాన్ని మార్చారు. ఎల్లుండి ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ ప్రాంగణంలో అంత్యక్రియలు జరగనున్నాయి. మొదట స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అనుకున్నప్పటికీ తాజాగా స్థలాన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక రేపు ఉదయం బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి గౌతమ్‌రెడ్డి పార్థివదేహాన్ని తరలిస్తారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు నెల్లూరు పరేడ్ గ్రౌండ్‌కు గౌతమ్‌రెడ్డి పార్థివదేహం చేరుకుంటుంది. ప్రజల సందర్శనార్థం ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు నెల్లూరులోని నివాసంలో భౌతికకాయం ఉంచుతారు. ఎల్లుండి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story