కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ.. నెక్స్ట్‌ ఏంటి..?

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ కాసేపట్లో ముగియనుంది.

Arun Chilukuri
Published on: 24 Sept 2023 4:20 PM IST
Chandrababus CID Custody to End in a Short While
X

కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ.. నెక్స్ట్‌ ఏంటి..?

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ కాసేపట్లో ముగియనుంది. సీఐడీ కస్టడీ అనంతరం.. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా చంద్రబాబును హాజరుపర్చనున్నారు సీఐడీ అధికారులు. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దా‍ఖలు చేయనున్నారు. చంద్రబాబును మరో మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరనున్నారు సీఐడీ అధికారులు. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నిన్న చంద్రబాబును కస్టడీకి తీసుకున్నారు సీఐడీ అధికారులు. దాదాపు 5 గంటల పాటు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి కొంత సమాచారం రాబట్టినట్టు సమాచారం. ఇక.. ఇవాళ సుమారు 6 గంటల పాటు విచారించనున్నారు అధికారులు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story