డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
x
Highlights

ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అణిచివేత విచ్చలవిడిగా...

ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, అణిచివేత విచ్చలవిడిగా మారడం దిగ్బ్రాంతి కలిగిస్తుందన్నారు. కొందరు పోలీసులు ప్రజల ప్రాథమిక హక్కులను అణిచేయడంపై శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి రక్షణ కవచమని ప్రజాస్వామికంగా ఎన్నికైనా ప్రభుత్వమే అసమ్మతిని అణిచేయడం హాస్యాస్పదమన్నారు. వైసీపీ అధికారులతో పోలీసులు కుమ్మక్కై ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ధ్వజమెత్తారు. శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తూ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories