Chandrababu: ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Arun Chilukuri
Published on: 8 March 2021 7:37 PM IST
Chandrababu writes letter to SEC Nimmagadda Ramesh Kumar
X

ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

Chandrababu: ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు మరో లేఖ రాశారు. టీడీపీ నేతలు మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌లపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారని బాబు లేఖలో ఆరోపించారు. అక్రమ కేసులు నమోదు చేసిన మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ మధుసూధన్ గౌడ్, ఎస్సై సుబ్బారావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ రోజు టీడీపీ నేతలు ఓటుహక్కు వినియోగించుకోనివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్‌ఈసీ స్పందించి అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరారు. ఇక ఎలక్షన్‌ ప్రక్రియను వీడియో రికార్డ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story