నేడు ప్రకాశం, బాపట్ల జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

Chandrababu: పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేసిన టీడీపీ నేతలు

Jyothi
Published on: 31 March 2024 10:57 AM IST
Chandrababu will visit Prakasam and Bapatla district today
X

నేడు ప్రకాశం, బాపట్ల జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు 

Chandrababu: ప్రజాగళం బస్సుయాత్రలో దూసుకెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మధ్యాహ్నం 12:30 గంటలకు తేరు బజార్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం మాధ్యా్హ్నం 2 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురంలోకి ప్రజాగళం యాత్ర ఎంటర్ అవుతుంది.

మార్కాపురంలో ప్రచారం నిర్వహించి.. బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు.సాయంత్రం బాపట్ల జిల్లాలోకి టీడీపీ ప్రజాగళం యాత్ర ప్రారంభం అవుతుంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రజాగళం బహిరంగ సభను నిర్వహించనున్నారు. సభ అనంతరం రాత్రికి బాపట్లలోనే చంద్రబాబు బస చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story