చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు.. ముహూర్తం ఎప్పుడంటే..?

TDP: ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈనెల 12న కొలువుదీరనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 6 Jun 2024 10:03 AM IST
Chandrababu Will Take Oath As AP CM On June 12th
X

చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు.. ముహూర్తం ఎప్పుడంటే..?

TDP: ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈనెల 12న కొలువుదీరనుంది. జూన్‌9 న చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ముందుగా డేట్ ఫిక్స్ చేయగా.. ప్రధాని మోడీ ప్రమాణస్వీకారోత్సవం నేపథ్యంలో 12కు వాయిదా వేశారు. ఎన్డీయే మిత్రపక్షాలు కూడా ప్రమాణస్వీకారానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. అయితే గతంలో అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకారం ఉంటుందని వెల్లడించగా.. వేదికపై పూర్తిస్థాయి క్లారిటీ అయితే రాలేదు.

ఇవాళ వేదికపై టీడీపీ నేతలు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఏపీలో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో అపూర్వమైన మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గానూ టీడీపీ – 136 , జనసేన – 21, బీజేపీ – 8 మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story