నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న చంద్రబాబు

Chandrababu: జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు

Jyothi
Published on: 14 March 2024 7:28 AM IST
Chandrababu will Release the Second List of TDP candidates today
X

నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న చంద్రబాబు

Chandrababu: వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే టార్గెట్‌గా పని చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలపడం కోసం గెలుపు గుర్రాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే జనసేనతో కలిసి 99 మందితో ఒక అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన చంద్రబాబు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాను నేడు ప్రకటించనున్నారు.

ఈ జాబితాలో కొంతమంది ఎంపీ అభ్యర్థుల పేర్లు సైతం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఇప్పటికే అభ్యర్థుల జాబితా విడుదల చేశాయి. మొత్తం 99 మందితో లిస్టు విడుదల చేయగా.. అందులో 94 మంది టీడీపీ, ఐదుగురు జనసేన అభ్యర్థులు ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల కేటాయింపులో టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు.. జనసేనకు 21 ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లు, బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు.

Jyothi

Jyothi

Next Story