Peddi Reddy: చంద్రబాబు కుప్పం బాట పట్టడం మా నైతిక విజయం

Peddi Reddy: ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పం వచ్చే వారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 6 Jan 2022 6:48 PM IST
Chandrababu will not win in Kuppam Next time Says Peddi Reddy Ramachandra Reddy
X

Peddi Reddy: చంద్రబాబు కుప్పం బాట పట్టడం మా నైతిక విజయం

Peddi Reddy: ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పం వచ్చే వారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. ఈరోజు గ్రామాలు తిరగాలని చంద్రబాబు నిర్ణయించారని అయితే ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పంలో చంద్రబాబు పర్యటించని గ్రామాలు చాలా ఉన్నాయని అన్నారు. కేవలం ఒడిపోతామన్న భయం, అభద్రతా భావంతో మూడు రోజుల కుప్పం పర్యటన పెట్టుకున్నారని విమర్శించారు.

చంద్రబాబు కుప్పం బాట పట్టడం తమ నైతిక విజయం అంటూ పెద్దరెడ్డి తెలిపారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పంలో గెలవడని కుప్పం ప్రజలకు తెలుసన్నారు. ఖచ్చితంగా కుప్పంలో గెలిచే పరిస్థితి లేకుండా చూస్తామంటూ పెద్దిరెడ్డి వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story