చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష చేపట్టనున్న చంద్రబాబు సతీమణి
Chandrababu Arrest: సా.5 గంటల వరకు నిరసన దీక్ష చేయనున్న భువనేశ్వరి
చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దీక్ష చేపట్టనున్న చంద్రబాబు సతీమణి
Chandrababu Arrest: గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా దీక్షలకు పిలుపునిచ్చింది టీడీపీ. ఇందులో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. మరోవైపు.. టీడీపీ అధినేత అరెస్ట్‌ను నిరసిస్తూ.. రాజమండ్రిలో నిరసన దీక్ష చేయనున్నారు ఆయన సతీమణి భువనేశ్వరి. ముందుగా రాజమండ్రిలోని లోకేష్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం దీక్ష ప్రారంభించనున్నారు.
సాయంత్రం 5 గంటల వరకు ఈ నిరసన దీక్ష కొనసాగనుంది. భువనేశ్వరితో పాటు ఈ దీక్షలో పలువురు మహిళలు కూడా పాల్గొననున్నారు. మరోవైపు.. జిల్లాలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో దీక్షకు అనుమతి కోరుతూ టీడీపీ శ్రేణులు దరఖాస్తు చేసుకున్నాయి.
Next Story




