Chandrababu: అందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం

Chandrababu: భావితరాల భవిష్యత్‌ను గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 July 2024 7:30 PM IST
Chandrababu Released a White Paper on the Power Sector
X

Chandrababu: అందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నాం

Chandrababu: భావితరాల భవిష్యత్‌ను గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. అన్ని శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక కష్టాలు ఎదురవుతాయని చెప్పారు.

గత ప్రభుత్వం ఎంత నష్టం చేసిందో ప్రజలకు చెబుతున్నామన్నారు. విద్యుత్‌ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు లక్షా 29 వేల 503 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వెల్లడించారు. విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్ర సాయం తీసుకుంటామన్నారు. వ్యవసాయ పంప్‌ సెట్లకు స్మార్ట్‌ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story