Atchannaidu: చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 44రోజులుగా జైల్లో పెట్టారు

Atchannaidu: కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారు

Shekhar G
Published on: 22 Oct 2023 1:03 PM IST
Chandrababu Was Jailed For 44 Days With Illegal Cases Says Atchannaidu
X

Atchannaidu: చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 44రోజులుగా జైల్లో పెట్టారు

Atchannaidu: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు. దేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గాష్టమి రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగు జాతిని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి 44 రోజులుగా జైల్లో పెట్టారని అన్నారు. తెలుగుజాతి ప్రతి విషయంలో ముందుండాలని పరితపించిన వ్యక్తి.. త్వరగా జైలు నుంచి విడుదలయ్యేలా అమ్మవారు అనుగ్రహించాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎన్ని కేసులు బనాయించిన కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.

Shekhar G

Shekhar G

Next Story