Chandrababu: ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు

Chandrababu: బాదుడే బాదుడు కార్యక్రమానికి చురుకుగా ఏర్పాట్లు

Rama Rao
Updated on: 4 May 2022 7:14 AM IST
Chandrababu Visits Srikakulam District Today
X

Chandrababu: ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహానాడుకి ముందే జిల్లాల్లో పర్యటించాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు. ఆముదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఆయన పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్‌ ఛార్జి, పార్టీజిల్లా అధ్యక్షులు కూన రవికుమార్.

ఇవాళ సాయంత్రం 4 గంటలు నుండి 6 గంటలవరకు వరకు గ్రామంలో పర్యటించనున్నారు చంద్రబాబు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. నిత్యావసర ధరల పెరుగుదల, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుదల ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు చంద్రబాబు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటలవరకు గ్రామ ప్రజలతో గ్రామ సభ నిర్వహిస్తారు. రాత్రి 8 గంటల నుండి గ్రామంలోని దళిత , బడుగు , బలహీన వర్గాల సహపంక్తి భోజనం చేయనున్నారు చంద్రబాబు. అలాగే జగన్ పాలనలో పెరిగిన ధరలు, బిల్లుల పై బాదుడే బాదుడు కార్యక్రమానికి ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story