విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
Chandrababu: తాత్కాలిక ఇబ్బందులు తొలగించాలని అమ్మవారిని వేడుకున్నా
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు
Chandrababu: తన పుట్టినరోజు సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రజల తరపున పోరాటం చేయడానికి తగిన శక్తి, సామర్థ్యాలు తనకు ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నానని చెప్పారు చంద్రబాబు. ప్రజలకు మళ్లీ సేవ చేసే అవకాశం ఇవ్వాలని, తాత్కాలిక ఇబ్బందులు తొలగించి పునర్‌వైభవం ఇవ్వాలని అమ్మవారిని ప్రార్థించానని అన్నారు. రాజీలేని పోరాటం చేస్తూ.. ప్రజలకు అండగా నిలబడుతూ.. అభిమానులుకున్న అంచనాల ప్రకారం ముందుకెళ్తానని స్పష్టం చేశారు చంద్రబాబు.
Next Story




