Chandrababu: ఇవాళ, రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన

Chandrababu: సాయంత్రం కుప్పం ఆర్టీసీ బస్టాండ్‌లో టీడీపీ సభ

Jyothi
Published on: 25 March 2024 7:24 AM IST
Chandrababu visit to Kuppam Today and Tomorrow
X

Chandrababu: ఇవాళ, రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి జోరుమీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, రోడ్‌ షోలు చేయనున్నారు. రోజుకు 4నియోజకవర్గాల్లో సభలు, రోడ్‌ షోలు సాగేలా ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ, రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు.

ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. అక్కడి స్థానిక కన్యకా పరమేశ్వరి ఆయలంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం కేవీఆర్ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం రాత్రి R&B గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.

రెండో రోజు పర్యటనలో భాగంగా రేపు ఉదయం చంద్రబాబు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి.. తర్వాత రాజుపేట దగ్గర హంద్రీ-నీవా కాలువ పరిశీలించనున్నారు. తిరిగి రాత్రికి R&B అతిథిగృహంలో బస చేయనున్నారు. చంద్రబాబు పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Jyothi

Jyothi

Next Story