Chandrababu: కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన

Chandrababu: పార్టీలో చేరికల్లో పాల్గొనున్న చంద్రబాబు

Jyothi
Updated on: 26 March 2024 9:15 AM IST
Chandrababu Visit to Kuppam on the Second Day
X

Chandrababu: కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన 

Chandrababu: కుప్పంలో రెండో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నిన్న భారీ రోడ్ షో.. బహిరంగ సభను నిర్వహించిన చంద్రబాబు.. నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు కేవీఆర్ కల్యాణ మండపంలో పార్టీలో చేరికల కార్యక్రమం ఉండనుంది. ఈకార్యక్రమానికి హాజరై.. పార్టీలో చేరే వారిని కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు. అనంతరం నియోజకవర్గంలోని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. సాయంత్రం రాజుపేట గ్రామం సమీపంలోనీ హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్నారు. రాత్రికి పార్టీ కార్యాలయానికి చేరుకుని కీలక నేతలతో నేతలతో సమావేశం కానున్నారు.

Jyothi

Jyothi

Next Story