Chandrababu: ఇవాళ్టి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Chandrababu Visit to Kuppam From Today
x

Chandrababu: ఇవాళ్టి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన

Highlights

Chandrababu: మూడు రోజుల పాటు చంద్రబాబు టూర్‌

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం టూర్‌పై టెన్షన్ నెలకొంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ శాంతిపురం మండలంలో పర్యటించనున్నారు. రేపు కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం అవుతారు. 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. మరోవైపు చంద్రబాబు కుప్పం పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉందని.. రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్‌లకు అనుమతి లేదని నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ తాజా జీవోలను ఉటంకిస్తూ డీఎస్పీ నోటీసులు పంపారు.

రోడ్లపై సభలు, ర్యాలీలు, రోడ్‌షోల మీద ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ఆధారంగా చంద్రబాబు పర్యటనకు అనుమతి తీసుకోవాల్సిందిగా పోలీసులు కుప్పం టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు. అనుమతి ఉన్న చోటే సభలు, కార్యక్రమాలు నిర్వహించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సభలు ఎక్కడ పెడుతున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు.

మరోవైపు పోలీసుల ఆంక్షలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంక్షల పేరుతో కార్యక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమ కార్యాచరణకు అనుగుణంగానే మందుకు వెళ్తామని చెబుతున్నారు. కుప్పం నియోజవర్గ పరిధిలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. దీనికి సంబంధించి షెడ్యూల్‌ను పార్టీ గత వారమే ఖరారు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories