Chandrababu: ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు టూర్‌

Jyothi
Updated on: 30 Nov 2022 1:24 PM IST
Chandrababu Visit to Eluru District
X

Chandrababu: ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu: ఇవాళ ఏలూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..! పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు.. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు టూర్‌ కొనసాగనుంది. ఇవాళ దెందులూరు, చింతలపూడి, రేపు పోలవరం, కొవ్వూరు, ఎల్లుండి నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. టీడీపీ తలపెట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..! కార్యక్రమం.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు జరగనుంది. ఇక.. డిసెంబర్‌ 2 నుంచి నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీ శ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌లు, నాయకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Jyothi

Jyothi

Next Story