చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. గోబ్యాక్ అంటూ నినాదాలు

Chandrababu: చంద్రబాబు పర్యటనతో చిత్తూరు జిల్లాలో హై టెన్షన్‌

Jyothi
Published on: 4 Aug 2023 2:05 PM IST
Chandrababu Visit to Chittoor District
X

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. గోబ్యాక్ అంటూ నినాదాలు 

Chandrababu: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోంపల్లిలో హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించేందుకు చంద్రబాబు బయలుదేరారు. ప్రస్తుతం ములకల చెరువు దగ్గర ఉన్న చంద్రబాబు.. కాసేపట్లో ప్రాజెక్టు పరిశీలిస్తారు. అనంతరం పుంగనూరు మీదుగా చిత్తూరు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో పుంగనూరులో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ముడెప్ప సర్కిల్‌కు భారీగా చేరుకున్న వైసీపీ నేతలు.. చంద్రబాబును అడ్డకుంటామని చెబుతున్నారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story