కుప్పంలో ముగిసిన చంద్రబాబు పర్యటన

Chandrababu: సమయం వచ్చినపుడు అందరినీ దారిలో పెడ్తా

Jyothi
Published on: 27 Aug 2022 9:28 AM IST
Chandrababu Visit Ended in Kuppam
X

కుప్పంలో ముగిసిన చంద్రబాబు పర్యటన

Chandrababu: ఏపీలో జగన్ నియంతృత్వ పాలన పాతరేసే రోజులు దగ్గరపడ్డాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనాయకులు అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మూడు రోజుల పర్యటన ముగిసింది. కుప్పం పరిసరాల్లోని దళవాయి కొత్తపల్లి, మోడల్ కాలనీ, క్రిష్ణదాసపల్లి, యానాదిపల్లి, ఓఎన్ కొత్తూరు గ్రామాల్లో పర్యటించారు. నిర్ణీత సమయానికంటే ఆలస్యంగా వచ్చినా... ప్రజలు నిరీక్షించారు. అధికార పార్టీ నాయకులు వ్యవహారశైలి, పోలీసుల పనితీరుపై చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.

పక్కనే ఉన్న తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయ లలిత ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను ముఖ్యమంత్రి స్టాలిన్ మంచి మనసుతో కొనసాగిస్తుంటే... ఏపీలో పేదలకు ఆకలితీర్చాలనుకున్న టీడీపీ అన్న క్యాంటీన్లను వైసీపీ గూండాలు ధ్వంసం చేశాయని విచారం వ్యక్తంచేశారు. బాధ్యతతో వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాయడం మంచిదికాదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ దారిలో పెడ్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story