Chandrababu Tweet : చివరికి ఆయనకు కరోనా అంటించారు: చంద్రబాబు

chandrababu tweet: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...
chandrababu tweet: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనను కడప సెంట్రల్ జైల్ లో ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా తెలుస్తోంది. తాను జైల్లో ఉండటం ద్వారా తనకు కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్నట్లు ఒక కేసులో బెయిల్పై వచ్చి న అనంతరం ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. అనుకున్నట్లే జరిగిందని ఆయనకు పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యపరిస్థితిపై ఆయన అభిమానులు, తెలుగుదేశం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జేసీ ప్రభాకర్‍రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరమని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వీడియోను ట్వీట్ చేశారు.
'తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరం. బెయిల్ పై విడుదలైన 24 గంటల్లోనే కరోనా నిబంధనలు అంటూ మళ్ళీ కేసుపెట్టి అరెస్టు చేసారు. చివరికి ఆయనకు కరోనా అంటించారు. ఈ ప్రభుత్వానికి దోపిడీ దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా?. మొన్న అచ్చెన్నాయుడు, ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారంటే కారణం ఎవరు? కరోనా ముప్పు ఉందని తెలిసీ ప్రజానాయకుల పట్ల ఇంత దారుణంగా నడుచుకుంటారా? వాళ్ళ ప్రాణాలు తీయాలన్న కుట్ర కాకపోతే ఏమిటిది? ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలి'అన్నారు. ఓ వీడియోను ట్వీట్ చేశారు.
తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడటం బాధాకరం. బెయిల్ పై విడుదలైన 24 గంటల్లోనే కరోనా నిబంధనలు అంటూ మళ్ళీ కేసుపెట్టి అరెస్టు చేసారు. చివరికి ఆయనకు కరోనా అంటించారు. ఈ ప్రభుత్వానికి దోపిడీ దొంగలకు, ప్రజల నుంచి వచ్చిన నాయకులకు తేడా తెలియదా?(1/2) pic.twitter.com/BJM8j1Zmil
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 19, 2020
మొన్న అచ్చెన్నాయుడు, ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి కరోనా బారిన పడ్డారంటే కారణం ఎవరు? కరోనా ముప్పు ఉందని తెలిసీ ప్రజానాయకుల పట్ల ఇంత దారుణంగా నడుచుకుంటారా? వాళ్ళ ప్రాణాలు తీయాలన్న కుట్ర కాకపోతే ఏమిటిది? ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించాలి(2/2)
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) August 19, 2020