Chandrababu: ఇవాళ రాయలసీమలో చంద్రబాబు టూర్

Chandrababu: రాయచోటి, కడపలో ప్రజాగళం బహిరంగ సభలు

Shashank Gullapelli
Published on: 2 May 2024 10:20 AM IST
Chandrababu Tour In Rayalaseema Today
X

Chandrababu: ఇవాళ రాయలసీమలో చంద్రబాబు టూర్

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే ప్రజాగళం పేరిట చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మేనిఫేస్టో విడుదల చేసిన తర్వాత దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనను చంద్రబాబు ఎండగడుతున్నారు. కడప, రాజంపేటలలో... అభివృద్ధి కరువు, రాయలసీమలో తాము ఉన్నప్పుడు ఏం చేశామో కూడా చంద్రబాబు తన ప్రజాగళం సభల ద్వారా వివరిస్తూ వెళుతున్నారు. ఈరోజు చంద్రబాబు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రాయచోటి నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. అనంతరం ఆయన కడపలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story