యర్రబాలెంకు చంద్రబాబు.. రైతుల దీక్షకు సంఘీభావం

యర్రబాలెంకు చంద్రబాబు.. రైతుల దీక్షకు సంఘీభావం
x
చంద్రబాబు
Highlights

విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. దుర్గగుడి అర్చకులు, అధికారులు...

విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. దుర్గగుడి అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో చంద్రబాబు దంపతులకు స్వాగతం పలికారు. అమ్మవారికి సతీ సమేతంగా చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన సంవత్సరంలో దుర్గమ్మని దర్శించుకొని అమరావతిని పరిరక్షించాలని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. ఐదుకోట్ల ప్రజలు ఆవేశంగా ఉన్నారని వారి భవిష్యత్‌ను ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.

ఎర్రబాలెంలో రైతులకు చంద్రబాబు దంపతులు సంఘీభావం తెలిపారు. ఆనందంగా గడపాల్సిన సమయంలో రైతులు రోడ్డుపైకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ, ఆవేదనతోనే ఇక్కడికి వచ్చానన్న చంద్రబాబు రాజధాని రైతుల మాటలు వింటే బాధగా ఉందన్నారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలని రైతులు భూములను త్యాగం చేశారని చెప్పారు. హైదరాబాద్‌ను చూస్తే తన విజన్ ఏమిటో అర్థమవుతుందన్న చంద్రబాబు ప్రపంచ మేధావులను హైదరాబాద్‌ తీసుకొచ్చానని గుర్తు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories