Chandrababu: సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్...

ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Aug 2024 10:14 AM IST
Chandrababu To Meet TATA Group Chairman Today
X

Chandrababu: సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ ...

Chandrababu: ఇవాళ ఏపీ సీఎంతో టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ కానున్నారు. ఉదయం పదిన్నర గంటలకు సీఎం చంద్రబాబుతో నటరాజన్‌ చంద్రశేఖరన్‌ సమావేశం కానున్నారు. అనంతరం చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల బృందం భేటీ కానుంది. సీఐఐ డీజీ చంద్రజిత్‌ బెనర్జీ నేతృత్వంలో సీఎం చంద్రబాబుతో సీఐఐ ప్రతినిధుల సమావేశం జరగనుంది. పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు.

ఇదిలా ఉంటే.. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం 5 గంటలకు ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. రేపు ప్రధాని మోడీని చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. అలాగే పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్‌నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాలపై చర్చించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story