Chandrababu: ఇవాళ ఏపీ సీఐడీ ఆఫీస్‌‌కు చంద్రబాబు

Chandrababu: సీఐడీ ఆఫీసులో పూచీకత్తు, బాండ్ అందజేయనున్న చంద్రబాబు

Shekhar G
Published on: 13 Jan 2024 9:53 AM IST
Chandrababu to AP CID office today
X

Chandrababu: ఇవాళ ఏపీ సీఐడీ ఆఫీస్‌‌కు చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఐఆర్ఆర్, ఇసుకతో పాటు మద్యం కేసుల్లో హైకోర్టు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చింది. వీటికి సంబంధించిన పూచీకత్తు, బాండ్‌ను చంద్రబాబు సీఐడీ అధికారులకు ఇవ్వనున్నారు. చంద్రబాబుకు ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు సంబంధిత దర్యాప్తు అధికారులకు చంద్రబాబు పూచీకత్తుతో పాటు లక్ష రూపాయల విలువ గల బాండ్‌ సమర్పించనున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి మధ్యాహ్నం 1:25 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:15 గంటలకు గుంటూరు నగరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి వెళతారు. సాయంత్రం 4:20 గంటలకు తాడేపల్లి, 5:05 గంటలకు తాడిగడపలోని సీఐడీ కార్యాలయాలకు కూడా వెళ్లి పూచీకత్తు, బాండ్‌ సమర్పిస్తారు.

Shekhar G

Shekhar G

Next Story