Chandrababu: ఖబడ్దార్‌.. మళ్లీ ఇలా జరిగితే వదిలిపెట్టం..

Chandrababu: చెన్నుపాటి గాంధీపై దాడి వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 5 Sept 2022 2:53 PM IST
Chandrababu Strong Warning to YSRCP Leaders
X

Chandrababu: ఖబడ్దార్‌.. మళ్లీ ఇలా జరిగితే వదిలిపెట్టం..

Chandrababu: చెన్నుపాటి గాంధీపై దాడి వెనుక వైసీపీ హస్తం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. గుండాయిజాన్ని నమ్ముకున్న వారు ఎవరూ బాగు పడలేదన్నారు. చెన్నుపాటి గాంధీపై దాడి చేసిన నిందితులపై కేసులు పెట్టకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఓడిపోతామనే పిరికితనంతో వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఖబడ్దార్‌.. ఇలాంటి ఘటన మరొకటి జరిగితే వదిలిపెట్టే సమస్యే లేదని ఆయన హెచ్చరించారు. కన్నుపొడవడం దుర్మార్గమని.. ఈ ఘటనలో దోషులకు శిక్ష పడే వరకు న్యాయపరంగా పోరాడతామని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story